logo

నిర్మించి.. నిర్లక్ష్యంగా వదిలేసి..

లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీనికి ఈ చిత్రమే నిదర్శనం.

Published : 08 Dec 2022 06:15 IST

మద్నూర్‌లో సిద్ధమైన నూతన భవనం

లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీనికి ఈ చిత్రమే నిదర్శనం. మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష గది శిథిలావస్థకు చేరడంతో నూతన వసతుల కల్పనకు రెండేళ్ల క్రితం రూ.57.90 లక్షలు మంజూరు చేశారు. రెండు నెలల క్రితమే పనులు పూర్తయినా వినియోగంలోకి తేవడంలేదు. దుర్ఘటనల్లో ఎవరైనా మరణిస్తే అరకొర వసతుల మధ్య శిథిల గదిలోనే శవపరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. దీనిపై ఆస్పత్రి వైద్యుడు ఆనంద్‌జాదవ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం త్వరలో నూతన భవనంలో సేవలు ప్రారంభిస్తామని చెప్పారు.

- న్యూస్‌టుడే, మద్నూర్‌

పాత భవనంలోని ఈ వరండాలోనే ప్రస్తుతం శవ పరీక్షలు చేస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు