logo

బోధన్‌కు మరో రైలు

బోధన్‌ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. సిర్పూర్‌-కరీంనగర్‌-నిజామాబాద్‌ మెమూ రైలును బోధన్‌ వరకు పొడిగించింది. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

Published : 08 Dec 2022 06:15 IST

సిర్పూర్‌ మెమూ పొడిగింపు

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ: బోధన్‌ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. సిర్పూర్‌-కరీంనగర్‌-నిజామాబాద్‌ మెమూ రైలును బోధన్‌ వరకు పొడిగించింది. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

* ప్రస్తుతం బోధన్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా మహబూబ్‌నగర్‌ ప్యాసింజర్‌ మాత్రమే నడుస్తోంది. గతంలో బోధన్‌-మిర్జాపల్లి ప్యాసింజర్‌ నడిచేది. కరోనా నేపథ్యంలో దీన్ని తాత్కాలికంగా రద్దు చేయగా తర్వాత తిరిగి పట్టాలెక్కలేదు. సిర్పూర్‌ మెమూ గురించి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వరకు అదనంగా 26 కి.మీ.ప్రయాణించనుంది. మధ్యలో జానకంపేట్‌ స్టేషన్‌లో నిలిపే అవకాశం ఉంది.

విద్యుదీకరణ పూర్తవడంతో..

నిజామాబాద్‌ - బోధన్‌ మార్గంలో నెల కిందట విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు ఇటీవల ట్రయల్‌రన్‌ విజయవంతంగా పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని