logo

విజయోస్తు

పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియలో కీలకమైన శారీరక సామర్థ్య పరీక్షలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. నిజామాబాద్‌ రాజారాం స్టేడియంలో పదిహేను రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి.

Published : 08 Dec 2022 06:15 IST

నేటి నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు

సిద్ధం చేసిన రన్నింగ్‌ ట్రాక్‌

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ: పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియలో కీలకమైన శారీరక సామర్థ్య పరీక్షలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. నిజామాబాద్‌ రాజారాం స్టేడియంలో పదిహేను రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు బుధవారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

కీలక అంశాలు

రోజు ఉదయం 5 గంటలకు పరీక్షలు మొదలుపెట్టి మధ్యాహ్నంలోగా ముగిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా మైదానానికి చేరుకోవాలి. అడ్మిట్‌ కార్డు చూపిస్తేనే అనుమతిస్తారు. ఎలాంటి వస్తువులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించరు.

* నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన 11,393 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే సంబంధిత తేదీలతో షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

* ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత.. బయోమెట్రిక్‌ హాజరు తీసుకొంటారు. తదుపరి విభాగాల వారీగా పరీక్షలు పూర్తి చేస్తారు.

సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

పక్కాగా ఏర్పాట్లు

శారీరక సామర్థ్య పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాం. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తాత్కాలిక వసతి కల్పించాలని కోరగా పరిశీలిస్తున్నాం. పరీక్షల్లో సాయం చేస్తామని మధ్యవర్తులు ప్రలోభపెడితే మా దృష్టికి తీసుకురావాలి.

- నాగరాజు, సీపీ, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని