logo

ఆరోగ్య తెలంగాణే భారాస లక్ష్యం: హరీశ్‌రావు

ఆరోగ్య తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 21 Dec 2022 15:37 IST

కామారెడ్డి పట్టణం: ఆరోగ్య తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో గర్భిణులకు కేసీఆర్‌ పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని భాజపా మాత్రం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి విమర్శించారు. తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొ్న్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. సీఎం కేసీఆర్‌ ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు. కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, ఎమ్మెల్యేలు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని