logo

నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి

వన్య ప్రాణుల వేటకు వెళ్లిన వేటగాడు ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి మృతి చెందిన ఘటన సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Published : 20 Jan 2023 04:33 IST

తూంపల్లిలో ఘటన

బానావత్‌ రావోజీ

సిరికొండ, మాచారెడ్డి, న్యూస్‌టుడే: వన్య ప్రాణుల వేటకు వెళ్లిన వేటగాడు ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి మృతి చెందిన ఘటన సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ధర్పల్లి సీఐ సైదా, సిరికొండ ఎస్సై నర్సింహులు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సర్ధాపూర్‌తండాకు చెందిన బానావత్‌ రావోజీ, రాంరెడ్డి, సోమర్‌పేట్‌కు చెందిన ఆశారెడ్డి కలిసి బుధవారం రాత్రి తూంపల్లి శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుపై ఉన్న రావోజీ (38)కి కింద ఉన్న రాంరెడ్డి తుపాకీ అందిస్తున్న క్రమంలో ట్రిగ్గర్‌ కొమ్మకు తగిలి పేలింది. తూటా నేరుగా రావోజీకి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని గురువారం డీఎఫ్‌ఓ వికాస్‌మీనా పరిశీలించారు. వేటగాళ్లపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1972 సెక్షన్లు 9, 39, 49, 50 కింద కేసు నమోదు చేశారు.

లభ్యమైన నాటు తుపాకీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని