logo

హామీ ఇచ్చి పది నెలలు..

సీఎం ప్రకటనతో ఉభయ జిల్లాల్లోని 394 మంది సెర్ప్‌, 413 మంది మెప్మా ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.

Published : 24 Jan 2023 04:59 IST

సెర్ప్‌, మెప్మా ఉద్యోగులకు అమలుకాని పేస్కేల్‌
ఉభయ జిల్లాల్లో 807 మంది ఎదురుచూపులు

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సెర్ఫ్‌ ఉద్యోగులు (పాత చిత్రం)

సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ), మెప్మా ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించి పది నెలలు దాటింది.    గతేడాది మార్చి 14న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పేస్కేల్‌ అమలు చేస్తామని      అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందే వారిని క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: సీఎం ప్రకటనతో ఉభయ జిల్లాల్లోని 394 మంది సెర్ప్‌, 413 మంది మెప్మా ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తుండటంతో ఉసూరుమంటున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని వేడుకుంటున్నారు.


రెండు దశాబ్దాలుగా విధులు

సెర్ప్‌, మెప్మాల్లో ఉద్యోగులను అప్పటి ప్రభుత్వాలు ఒప్పంద ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నాయి. తెదేపా హయాంలో వెలుగు పథకం కింద, తర్వాత కాంగ్రెస్‌ కాలంలో ఇందిరాక్రాంతి పథంలో పనిచేస్తూ వచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సెర్ప్‌గా పేరు మార్చారు. మొత్తం మీద ఇరవై ఏళ్లుగా ప్రభుత్వాలు అప్పగించిన విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళలు - ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారు.


ఇరవై ఏళ్లుగా..

- రాజిరెడ్డి, సెర్ప్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి

సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపాటు పేస్కేల్‌ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇరవై ఏళ్ల మా నిరీక్షణకు త్వరలోనే ముగింపు పలుకుతారనే ఆశతో ఉన్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని