సర్వేలో మతలబు.. రూ.పది కోట్ల భూమికి ఎసరు
భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో భూకబ్జాలు సర్వసాధారణమయ్యాయి. ప్రభుత్వ భూములను అందినకాడికి దండుకున్నారు. తాజాగా మరో దందా తెరమీదికొచ్చింది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న మూడెకరాలు కాజేసేందుకు కొందరు రంగంలోకి దిగారు.
జంగంపల్లిలో వెలుగుచూసిన భూకబ్జా
ఈనాడు డిజిటల్, కామారెడ్డి, న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్
జంగంపల్లి గ్రామస్థులతో మాట్లాడుతున్న డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో సాయిబాబా, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్
భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో భూకబ్జాలు సర్వసాధారణమయ్యాయి. ప్రభుత్వ భూములను అందినకాడికి దండుకున్నారు. తాజాగా మరో దందా తెరమీదికొచ్చింది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న మూడెకరాలు కాజేసేందుకు కొందరు రంగంలోకి దిగారు. విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుంది. గ్రామ శివారులో డంపింగ్‌యార్డు పరిసరాల్లో బండరాళ్లు తొలగించి హరితహారం మొక్కలు ధ్వంసం చేస్తుండగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో సాయిబాబా, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంపీవో ప్రవీణ్ బుధవారం ఘటనా స్థలానికి చేరుకొని పనులు అడ్డుకున్నారు. అంతకు ముందే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ప్రభుత్వ స్థలం కబ్జా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
జంగంపల్లిలోని సర్వే నం. 237లో మూడెకరాల ప్రభుత్వ భూమిని శివాయిపల్లికి చెందిన శేర్ల రమేశ్‌కు ప్రభుత్వం 2001లో కేటాయించింది. * ఆయన 2003లో డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కార్మికుల నివాసం కోసం చిన్నగదులు నిర్మించారు. వీటి కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గానికి దరఖాస్తు చేసుకోగా అనుమతులు జారీ చేశారు. నాటి నుంచి జీపీకి పన్నులు చెల్లిస్తున్నారు. * కొన్నాళ్లకు ప్లాంటు మూతపడగా గదులు అలాగే ఉన్నాయి. * రెండున్నరేళ్ల క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ పంచాయతీకి నివేదిక ఇవ్వడంతో అక్కడే డంపింగ్‌యార్డు నిర్మించారు. * తాజాగా ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి అక్కడికి వచ్చారు. గతంలో రమేశ్ నిర్మించిన గదులు ధ్వంసం చేయించారు. బండరాళ్లు తొలగిస్తూ చదును చేయిస్తున్నారు. ఈ విషయంపై రమేశ్ భిక్కనూరు ఠాణాలో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదు. * డంపింగ్‌యార్డు పక్కన నాటిన మొక్కలు ధ్వంసం చేయిస్తుండగా భిక్కనూరు ఎంపీవో ప్రవీణ్ చూసి డీపీవోకు సమాచారమిచ్చారు. పంచాయతీ అధికారులు, గ్రామస్థులు చేరుకొని అడ్డుకున్నారు. * తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయంటూ వచ్చిన వ్యక్తిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సర్వే చేయిస్తామని అధికారులు నచ్చజెప్పడంతో గ్రామస్థులు సరేనన్నారు.
మరోసారి చేయాలి
- శ్రీనివాస్‌రావు, డీపీవో, కామారెడ్డి
జంగంపల్లిలో డంపింగ్‌యార్డు ఉన్న స్థలం తమదని కొందరు చెబుతున్నారు. సదరు స్థలంలోకి ప్రవేశించి మొక్కలు ధ్వంసం చేశారు. సర్వే చేసినప్పుడు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. ప్రజలందరి సమక్షంలో మరోసారి సర్వే చేయాలి.
ఇప్పుడెలా వచ్చాయి?
సర్వేకు టిపన్లు లేవంటూ భూకొలతలశాఖ అధికారులు 2016లో పంపిన లేఖ
సర్వేనం. 237లో 1200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. పక్కనే కొన్ని పట్టా భూములున్నాయి. అసైన్డ్ను ఆనుకొని పట్టా భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నెల రోజుల క్రితం సర్వే చేయించుకున్నారు. రెండు సర్వే నంబర్లతో 9.20 ఎకరాల వరకు ఉండాలి. సర్వేకు వచ్చిన భూకొలతలశాఖ ఏడీ మాత్రం డంపింగ్‌యార్డు స్థలంతో పాటు రమేశ్ నిర్మించుకున్న గదుల వరకు మొత్తం పట్టాగా నివేదిక ఇచ్చారని కొనుగోలు చేసిన వ్యక్తి చెబుతున్నారు. ఏడీనే స్వయంగా హద్దులు చూపించారని, ఆ ప్రకారమే చదును చేయిస్తున్నానని పేర్కొంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. జంగంపల్లిలో సర్వే నం. 221, 222 సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని కామారెడ్డికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి 2016లో నిజామాబాద్ భూకొలతలశాఖ కార్యాలయానికి స.హ.చట్టం కింద దరఖాస్తు చేశారు. వీటికి సంబంధించిన టిపన్లు లేనందున సర్వే చేయలేమని ఏడీనే లేఖ పంపించారు. మరిప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో అధికారులకే తెలియాలి.
నోటీసులు ఇచ్చారా?
భూకొలతలశాఖ అధికారులు ఒక సర్వే చేయాలంటే సదరు భూమి చుట్టుపక్కల ఉన్న యజమానులకు ముందు రోజు నోటీసులు ఇస్తారు. జంగంపల్లిలో చేసినప్పుడు ఒక్కరికీ జారీ చేయలేదని గ్రామస్థులు, అధికారులు అంటున్నారు. స్థానిక పంచాయతీకి, పరిసరాల రైతులకు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో పోయిన పట్టా భూమికి బదులుగా పక్కనే ఉన్న అసైన్డ్‌పై కొందరు కన్నేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోసారి నోటీసులు జారీ చేసి ప్రజల సమక్షంలో సర్వే చేయాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!