logo

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు.

Updated : 30 Jan 2023 04:42 IST

ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ను సన్మానిస్తున్న బర్దీపూర్‌ వాసులు

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. మల్లాపూర్‌లో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌, ఎంపీపీ రమేశ్‌ నాయక్‌, జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డి, జగన్‌, సర్పంచి సత్యనారాయణ, ఉపసర్పంచి రఘునందన్‌, ఎంపీడీఓ రాములునాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులున్నారు.

నిధులకు వినతి

బర్దీపూర్‌(డిచ్‌పల్లి గ్రామీణం): బర్దీపూర్‌లో నిర్మించనున్న రెడ్డి సంఘ భవనానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయణ్ను సన్మానించారు. సంఘం అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపసర్పంచి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాయకులు పద్మారావు, రాము తదితరులున్నారు.


కల్యాణ మండపానికి..

ధర్పల్లి: బంజారా కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఆర్టీసీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌ సంఘం మండల కమిటీకి ప్రొసీడింగ్‌ పత్రం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సుమారు రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు లాల్‌సింగ్‌, సభ్యులు శంకర్‌, శివరాం, శ్రీనివాస్‌ తదితరులున్నారు.


బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం..

జక్రాన్‌పల్లి: కొలిప్యాక్‌లోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు ఆహ్వానించారు. వచ్చే నెల 2 నుంచి 7వ తేదీ వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని