logo

సాహిత్యపోలీసు

ఆయన వృత్తి శాంతిభద్రతలు కాపాడటం.. ప్రవృత్తి సాహిత్య సేవ.. విధి నిర్వహణలో ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తారు.

Published : 30 Jan 2023 03:04 IST

రచనలో రాణిస్తున్న ఏఎస్సై సురేశ్‌

దోషి పుస్తకం విడుదల చేస్తున్న సీపీ నాగరాజు(పాతచిత్రం)

ఆయన వృత్తి శాంతిభద్రతలు కాపాడటం.. ప్రవృత్తి సాహిత్య సేవ.. విధి నిర్వహణలో ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తారు. ఆ తర్వాత లాఠీ పక్కనెట్టి కలం చేత పడతారు ముప్కాల్‌ ఠాణా ఏఎస్సై సురేశ్‌.

న్యూస్‌టుడే, ముప్కాల్‌

నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లీకి చెందిన సురేశ్‌కు రచనలంటే అమితమైన ఆసక్తి. నెలవంక అనే కలం పేరుతో ఇప్పటి వరకు 30కి పైగా కథలు, కథానికలు రాశారు. 15 కథలు, ఒక కవితా సంపుటి ప్రచురితమైంది. సొంతంగానే ముద్రణ చేయిస్తూ ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. మేటి ఇందూరు కవుల్లో ఒకడిగా.. సమ్మేళనాల్లో పాల్గొంటూ అందరిచే మన్ననలు పొందుతున్నారు. తెలుగు భాషపై మక్కువతో సాహిత్యసేవ చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.

రచనలు

* మీకోసం అనే రచన ద్వారా పోలీసు సాధక బాధల గురించి తెలిపారు. దీన్ని పోలీసు అమరులకు అంకితమిచ్చారు.

* కాలచక్రంతో సగటు మనుషుల జీవన విధానం వివరించారు.

* కాలేజీ అమ్మాయి, శ్రీమతికి ప్రేమతో, ఉదయ శిఖరం, మీలో ఒకడు, పక్కింటి కోడలు, బావే నా ప్రాణం, స్వర్గానికి నిచ్చెన, నేటి విద్యార్థి, అనుబంధాలు, మీరజాలగలడా, కోమలి, దోషి, ఈ అమ్మాయే మన కోడలు తదితరాలు ప్రచురితమయ్యాయి.

* దోషి నవలను ఇటీవల సీపీ నాగరాజు చేతుల మీదుగా విడుదల చేశారు.

* చిట్టి కుందేలు అనే బాలసాహిత్య కథ ద్వారా ‘కూతురు సంతోషం ఎదుట డబ్బు సరితూగదు’ అనే భావాన్ని వ్యక్తపర్చారు. ఈ కథానికను హిందీలోకి నన్హా ఖర్గోష్‌ అనే పేరుతో అనువదించారు.

పురస్కారాలు, సన్మానాలు

* ఎన్‌సీసీ 75 ఏళ్ల వేడుకల సందర్భంగా అల్ట్రా రన్నర్‌ కే.ఎస్‌.బద్వార్‌ అభినందించి, సత్కరించారు.  ః పిల్లల కథలైన జావలి, దేవకన్య రచనలకు భాషా సాంస్కృతిక శాఖ నుంచి సత్కారం అందుకున్నారు.  

* గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్‌ వారి కళా సేవా రంగ పురస్కారం.  

* రాష్ట్రస్థాయి ఉగాది గోల్డెన్‌ నంది సొంతం. * పుడమి జాతీయ అవార్డు.  * కళా నిలయం వారి జాతీయ పురస్కారం.  * కిరణ్‌ సాహితీ సంస్థచే ప్రతిభామూర్తి పురస్కారం.  * బీఎస్‌ రాములు స్ఫూర్తి అవార్డు సొంతం.  

* ధాత్రి సాహితీ సేవా సంస్థ వారి రాష్ట్రస్థాయి ప్రతిభ సేవా రత్న అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని