logo

కాడునే కాజేశారు

చోరీ చేసేందుకు కాదేది అనర్హం అన్నట్లు.. కొందరు ఆగంతుకులు అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాటు చేసిన కాడునే కాజేశారు.

Published : 30 Jan 2023 03:04 IST

చోరీ చేసేందుకు కాదేది అనర్హం అన్నట్లు.. కొందరు ఆగంతుకులు అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాటు చేసిన కాడునే కాజేశారు. వినడానికి వింతగా ఉన్నా.. నందిపేట్‌ మండలం ఆంధ్రానగర్‌ శ్మశానవాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైకుంఠధామంలో రెండు చితులు ఒకేసారి పేర్చుకునేందుకు వీలుగా ఇనుప స్తంభాలు బిగించారు. ఒక్కోదానికి ఆరేసి చొప్పున కడ్డీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదానికి సంబంధించి పూర్తిగా ఎత్తుకెళ్లగా మరోదాంట్లో ఒక స్తంభం కాజేశారు.  ఇటీవల గ్రామంలో ఓ వ్యక్తి చనిపోవడంతో శ్మశానానికి వెళ్లగా స్తంభాలు కనిపించకపోవడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు.

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని