logo

తప్పు ఒకరిది.. చలానా మరొకరికి

వాహన చోదకులు నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కెమెరాతో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తుండడంతో ఒకరికి బదులు మరొకరు చలాన్లు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Published : 30 Jan 2023 03:04 IST

బీర్కూర్‌, న్యూస్‌టుడే: వాహన చోదకులు నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కెమెరాతో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తుండడంతో ఒకరికి బదులు మరొకరు చలాన్లు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటన బీర్కూర్‌లో గుండం గంగారాంకు ఎదురైంది. అతని ద్విచక్ర వాహనం నంబరు టీఎస్‌ 17 జీ 6817. శిరస్త్రాణం ధరించలేదని 2021 జులై 11న  ఈ చలాన్‌ ద్వారా రూ.235 జరిమానా విధించారు. 15 రోజుల క్రితం బీర్కూర్‌ ఠాణా ఎదుట నుంచి పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు ఆపి తన వాహనంపై ఏడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని కట్టాలని మందలించి వదిలేశారు. అనుమానం వచ్చి గంగారం స్థానిక పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలుసుకున్నారు. తీరా చూస్తే 8817 ద్విచక్ర వాహనంపై వేయాల్సిన చలాన్లు గంగారం ద్విచక్ర వాహనం 6817 నంబర్‌కు (ఏడు చలాన్లు మొత్తం రూ.1145) విధించారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, 15 కి.మీ దాటి ఎక్కడకు వెళ్లనని చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, మెదక్‌, బాన్సువాడ, పిట్లం, నస్రుల్లాబాద్‌ ప్రాంతాల్లో శిరస్త్రానిణం లేకుండా ప్రయాణించినట్లు తనకు జరిమానా విధించడం ఆశ్యర్యం వేసిందని బాధితుడు వాపోయారు. ద్విచక్ర వాహనంపై ఆరు సంఖ్య ఎనిమిదిలాగా కన్పించడంతోనే వేరే వ్యక్తికి వెళ్లే చలాన్లు గంగారాం ద్విచక్ర వాహనానికి వచ్చాయని పోలీసులు తెలిపారు. బాన్సువాడలో అధికారులను సంప్రదించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని బాధితుడు  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని