logo

ఉద్యోగుల సహకారంతోనే అభివృద్ధి

అటెండర్‌ నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అంకితభావంతో పనిచేయడంతోనే అభివృద్ధి సాధ్యమైందని వికారాబాద్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న నారాయణరెడ్డి అన్నారు.

Published : 02 Feb 2023 03:36 IST

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న నారాయణరెడ్డి దంపతులను

సన్మానిస్తున్న సీపీ నాగరాజు, ఉద్యోగులు

నిజామాబాద్‌, కలెక్టరేట్‌: అటెండర్‌ నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు అంకితభావంతో పనిచేయడంతోనే అభివృద్ధి సాధ్యమైందని వికారాబాద్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న నారాయణరెడ్డి అన్నారు. మూడేళ్లుగా నిజామాబాద్‌ జిల్లాలో పాలనాధికారిగా సేవలందించిన ఆయనకు ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘అందుబాటులో ఉన్న వనరులతోనే నాణ్యమైన సేవలు అందించాలనేది నా విధానం. సమస్యపై వినతిపత్రంతో వస్తే.. తిరస్కరించకుండా చట్టపరిధిలో ఎంతవరకు పరిష్కరించవచ్చో ఆలోచించాలి. కాళ్లకు చెప్పులు లేకుండా జేబులో రూపాయి లేని రోజులు గడిపాను. దేవుడి దయతో ఈ స్థాయిలో ఉన్నాను. సాధ్యమైనంత వరకు పేదలకు సేవచేసే అవకాశం దక్కిందని భావిస్తున్నాను. ఉద్యోగుల తోడ్పాటుతోనే ధాన్యం సేకరణ, హరితహారం, ఉపాధిహామీ, స్వచ్ఛసర్వేక్షణ్‌ వంటి అంశాల్లో జిల్లాను ముందువరుసలో నిలబెట్టాం. కరోనా సమయంలో ఆశా కార్యకర్తలతో సహా వైద్యాధికారులు సిబ్బంది కష్టపడి పనిచేశారు. ఉద్యోగ జీవితంలో బదిలీలు తప్పవు. అందరిని విడిచి వెళ్తున్నందుకు బాధగా’ ఉందన్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను ఉద్యోగిగా కాకుండా సోదరుడిగానే భావించానంటూ భావోద్వేగానికి గురయ్యారు. అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ నాగరాజు, డీఎంహెచ్‌వో సుదర్శనం, కార్మికశాఖ అధికారి యోహన్‌, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, మెప్మా పీడీ రాములు, రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని