logo

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పెద్దపీట వేస్తోందని ఆర్‌ఎం ఉషాదేవి అన్నారు. బోధన్‌ డిపోలో రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను ఆమె బుధవారం ప్రారంభించారు.

Published : 02 Feb 2023 03:36 IST

సూపర్‌ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆర్‌ఎం  ఉషాదేవి, డీఎం టీఎన్‌ స్వామి తదితరులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పెద్దపీట వేస్తోందని ఆర్‌ఎం ఉషాదేవి అన్నారు. బోధన్‌ డిపోలో రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను ఆమె బుధవారం ప్రారంభించారు. కొత్త బస్సుల్లో అధునాతన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌, ఒంగోలు మార్గాల్లో ప్రయాణించే ఈ బస్సుల్లో అగ్ని ప్రమాదాన్ని గుర్తించే అలారం, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోధన్‌ ప్రయాణ ప్రాంగణంలో మూత్రశాలలు, మరుగుదొడ్లను ఉచితంగా వినియోగించుకునే సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. డీఎం టీఎన్‌ స్వామి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని