logo

ప్రాణం తీసిన అతివేగం

అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒర్రెలో పడటంతో దుర్మరణం చెందిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకొంది.

Published : 02 Feb 2023 03:36 IST

ధర్పల్లి, న్యూస్‌టుడే: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒర్రెలో పడటంతో దుర్మరణం చెందిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌కు చెందిన కృష్ణ(48), ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(45).. ధర్పల్లిలోని దేశాయి బీడీ కంపెనీలో ప్యాకర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు మంగళవారం సాయంత్రం 8 గంటలకు విధులు ముగించుకొని స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తిరిగి వస్తుండగా.. ధర్పల్లి శివారులోని మూలమలుపు వద్ద ఒర్రెలో పడిపోయారు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మరణించారు. శ్రీనివాస్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

గతేడాది పురస్కారం ప్రదానం..

శ్రీనివాస్‌ దివ్యాంగుడు. సంబంధిత సంఘం మండల అధ్యక్షుడిగా ఉత్తమ సేవలు అందించారు. ఇందుకు గాను గతేడాది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అప్పటి పాలనాధికారి నారాయణరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

మూలమలుపు పరిశీలన

ధర్పల్లి నుంచి భీమ్‌గల్‌ వెళ్లే రహదారిపై ఉన్న మూలమలుపును నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ, ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ సుధీర్‌ పరిశీలించారు. స్పీడ్‌ బ్రేకర్లతోపాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని