logo

బాధితులే.. నిందితులై!2 డబ్బుల కోసం కుటుంబం అపహరణనిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి నిందితులుగా మారారు. నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం దూద్‌గాంకు చెందిన అబ్దుల్‌ అన్వర్‌ వృత్తిరీత్యా వ్యాపారి. 2019లో ఇతడు తాను దుబాయ్‌ వెళ్లొచ్చానని, తనవద్ద ఉన్న బంగారాన్ని మార్కెట్‌ ధర కన్నా తక్కువకే ఇస్తానంటూ దూరపు బంధువైన నబీ షాబ్‌ అలియాస్‌ మహ్మద్‌ నబీకి నమ్మబలికాడు. నబీ తనకు తెలిసిన మహ్మద్‌ అలీం, అబ్దుల్‌ గఫర్‌, మహ్మద్‌ ఖాజాషఫియుద్దీన్‌, మహ్మద్‌ అబ్దుల్‌ షౌకత్‌, విక్రాంత్‌, బచ్చు గంగాసాగర్‌, నజీర్‌, ఖలీల్‌, యూనుస్‌, సమికి విషయం చెప్పాడు. అందరూ కలిసి సుమారు రూ.10 కోట్లు అన్వర్‌కు ఇచ్చారు. వారికి కొంత బంగారం ఇచ్చి మిగతాది ఇవ్వకుండా, డబ్బులు తిరిగిచ్చేయకుండా దాదాపు ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అన్వర్‌ నిర్మల్‌ పట్టణం గాయత్రీపురంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడనే సమాచారం తెలుసుకుని అతడిని పట్టుకొని ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్నారు. అన్వర్‌ ఉంటున్న నివాసానికి వెళ్లి అతడిని, అతని భార్య, ఇద్దరు పిల్లలను బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ సమీపంలోని మిత్రుడి రైస్‌మిల్లులో వారిని బంధించారు. కోపంతో అతడిపై దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. ఈలోపు అన్వర్‌ బంధువులు కిడ్నాప్‌ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకొని భయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వెళ్తే పోలీసులకు దొరకమని బుధవారం రెండు కార్లలో బయల్దేరారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిర్మల్‌ పట్టణం సోఫినగర్‌ ప్రాంతంలో కాలకృత్యాల కోసం ఆగిఉన్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కార్లు, 7 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. బందీగా ఉన్న కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లేశ్‌, ఎస్సైలు గంగాధర్‌, యాసిర్‌ అరాఫత్‌ ఉన్నారు.వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి

తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు.

Published : 02 Feb 2023 03:36 IST

డబ్బుల కోసం కుటుంబం అపహరణ

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఓ మోసగాడి మాటలకు ఆశపడి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి, తీరా మోసపోయామని గుర్తించిన వారు.. నగదు తిరిగివ్వాలని కోరారు. నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో.. అందరూ కలిసి సదరు వ్యక్తి కుటుంబాన్ని అపహరించారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి నిందితులుగా మారారు. నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం దూద్‌గాంకు చెందిన అబ్దుల్‌ అన్వర్‌ వృత్తిరీత్యా వ్యాపారి. 2019లో ఇతడు తాను దుబాయ్‌ వెళ్లొచ్చానని, తనవద్ద ఉన్న బంగారాన్ని మార్కెట్‌ ధర కన్నా తక్కువకే ఇస్తానంటూ దూరపు బంధువైన నబీ షాబ్‌ అలియాస్‌ మహ్మద్‌ నబీకి నమ్మబలికాడు. నబీ తనకు తెలిసిన మహ్మద్‌ అలీం, అబ్దుల్‌ గఫర్‌, మహ్మద్‌ ఖాజాషఫియుద్దీన్‌, మహ్మద్‌ అబ్దుల్‌ షౌకత్‌, విక్రాంత్‌, బచ్చు గంగాసాగర్‌, నజీర్‌, ఖలీల్‌, యూనుస్‌, సమికి విషయం చెప్పాడు. అందరూ కలిసి సుమారు రూ.10 కోట్లు అన్వర్‌కు ఇచ్చారు. వారికి కొంత బంగారం ఇచ్చి మిగతాది ఇవ్వకుండా, డబ్బులు తిరిగిచ్చేయకుండా దాదాపు ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అన్వర్‌ నిర్మల్‌ పట్టణం గాయత్రీపురంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడనే సమాచారం తెలుసుకుని అతడిని పట్టుకొని ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్నారు. అన్వర్‌ ఉంటున్న నివాసానికి వెళ్లి అతడిని, అతని భార్య, ఇద్దరు పిల్లలను బలవంతంగా అపహరించి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ సమీపంలోని మిత్రుడి రైస్‌మిల్లులో వారిని బంధించారు. కోపంతో అతడిపై దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. ఈలోపు అన్వర్‌ బంధువులు కిడ్నాప్‌ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకొని భయపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వెళ్తే పోలీసులకు దొరకమని బుధవారం రెండు కార్లలో బయల్దేరారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిర్మల్‌ పట్టణం సోఫినగర్‌ ప్రాంతంలో కాలకృత్యాల కోసం ఆగిఉన్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కార్లు, 7 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. బందీగా ఉన్న కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లేశ్‌, ఎస్సైలు గంగాధర్‌, యాసిర్‌ అరాఫత్‌ ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని