logo

మత సామరస్యానికి ప్రతీక బడాపహాడ్‌

బడాపహాడ్‌ సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.

Published : 03 Feb 2023 06:01 IST

గంధాలను ఊరేగింపుగా తీసుకెళ్తున్న సభాపతి పోచారం

వర్ని, న్యూస్‌టుడే: బడాపహాడ్‌ సయ్యద్‌ హజరత్‌ షాదుల్లా బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. జలాల్‌పూర్‌ గ్రామ మజీద్‌ వద్ద సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి గంధాలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా దర్గా నిలిచిందని పేర్కొన్నారు. తొలుత గుర్రం విన్యాసాలను భక్తులు తిలకించారు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన అశ్వం, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పాలతో గుర్రం కాళ్లు కడిగారు. ఒంటెను పూజించి కాళ్ల మధ్య నుంచి వెళ్లడానికి పోటీపడ్డారు. గ్రామం నుంచి బడాపహాడ్‌ వరకు ఊరేగింపుగా తరలివెళ్లారు. వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని రైతువేదికలో కంటి వెలుగు శిబిరాన్ని సభాపతి ప్రారంభించారు. ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని