దేవగిరి పరుగులు మరింత వేగంగా.
‘‘సికింద్రాబాద్-ముంబయి దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఇక మరింత వేగంతో పరుగు పెట్టనుంది. సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో ప్రస్తుతం నడుస్తుండగా..
మార్చి నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
న్యూస్‌టుడే, ఇందూరు సిటీ: ‘‘సికింద్రాబాద్-ముంబయి దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఇక మరింత వేగంతో పరుగు పెట్టనుంది. సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో ప్రస్తుతం నడుస్తుండగా.. వీటి స్థానంలో ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్‌మన్ బుష్) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.’’
అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువుగా ఉండి రైలు వేగంగా నడిచేలా దోహదపడనున్నాయి. ప్రయాణికుల భద్రతకు వీటిల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటి, రెండు, మూడో క్లాస్ ఏసీతో పాటు 10 స్లీపర్ కోచ్‌లున్నాయి. నిజామాబాద్ జంక్షన్ మీదుగా నిత్యం సికింద్రాబాద్-ముంబయి రైలు(రానుపోను రెండు సర్వీసులు) రాకపోకలు సాగిస్తోంది. రోజువారీగా నడిచేది ఇదొక్కటే కావటంతో ఎ ప్పుడూ ప్రయాణికుల రద్దీ ఉంటోంది.
పెరిగే అవకాశం : రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను జత చేయనున్నారు. ఫలితంగా ఇప్పుడున్న వాటితో పోలిస్తే అదనంగా కోచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రైలు వేగం పెరగనుండటంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్