పౌష్టికాహారం అందాలి.. మోము మెరవాలి
అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ హాస్యాస్పదంగా మారింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో అంగన్‌వాడీ సరకుల నమోదుకు శ్రీకారం
అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ హాస్యాస్పదంగా మారింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఆయా కేంద్రాల్లో అక్రమాలు కట్టడి చేసేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా న్యూట్రీషన్, హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది.
న్యూస్‌టుడే, ఖలీల్‌వాడి(నిజామాబాద్): జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, డిచ్‌పల్లి ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,500 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో బాలింతలు 13625, గర్భిణులు 13241, ఆరేళ్ల లోపు చిన్నారులు 95,874 మంది నమోదై ఉన్నారు. వీరికి సరకులు, భోజనం, పాలు, గుడ్లు ఇచ్చిన తర్వాత వివరాలను దస్త్రాల్లో పొందుపర్చేవారు. ఇలా మ్యాన్‌వల్ విధానంతో కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన సర్కారు వీటికి చెక్ పెట్టాలని అంతర్జాలంలో నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతేడాదే అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేయడం గమనార్హం.
ఎప్పటికప్పుడు సమాచారం..
పోషకాల పంపిణీ నుంచి నిల్వల వరకు అంతా పారదర్శకంగా ఉండేలా డెయిలీ రిపోర్టు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే న్యూట్రీషన్, హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్. ఇందులో ప్రతిరోజు లబ్ధిదారులు ఎందరు హాజరయ్యారు.. ఎంత మందికి భోజనం పెట్టారు.. తదితర పూర్తి సమాచారం యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వీలుంటుంది. దీనికితోడు ఏ కేంద్రంలో వేటి కొరత ఉందో సకాలంలో గుర్తించి అవసరమైన వాటిని సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుంది.
సమస్యలు ఉంటే..
లబ్ధిదారుల హాజరు, పిల్లల ఎదుగుదల, శారీరక.. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల వివరాలను పోషణ్ అభియాన్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
పక్కాగా అమలు
- సుధారాణి, ఇన్‌ఛార్జి జిల్లా సంక్షేమాధికారిణి
పోషకాహార పంపిణీ, నిల్వలు అంతా పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం న్యూట్రీషన్, హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో పక్కాగా అమలు చేయిస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!