logo

దేశసేవలో భాగస్వాములు కావాలి

విద్యార్థులు జ్ఞానం, శీలం, ఏకతను పెంపొందించుకోవడంతో పాటు దేశసేవలో భాగస్వాములు కావాలని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.

Published : 03 Feb 2023 06:01 IST

ఏసీపీ వెంకటేశ్వర్లుకు జ్ఞాపిక అందజేస్తున్న ప్రతినిధులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులు జ్ఞానం, శీలం, ఏకతను పెంపొందించుకోవడంతో పాటు దేశసేవలో భాగస్వాములు కావాలని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. నిజామాబాద్‌ నగరంలోని బస్వాగార్డెన్లో గురువారం అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఇందూరుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సమ్మేళనానికి ఆయన కాకతీయ విద్యాసంస్థల డైరెక్టరు రజినీకాంత్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరించి, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, స్త్రీల పట్ల గౌరవభావంతో ఉండాలన్నారు. విభాగ్‌ ప్రముఖ్‌ నరేశ్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేశ్‌, నగర అధ్యక్షుడు వెంకటకృష్ణ, విభాగ్‌ కన్వీనర్‌ మనోజ్‌,  సూర్యకుమార్‌, సునీల్‌, మహేశ్‌, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని