‘ఉపాధ్యాయుడిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి’
నిజామాబాద్ జిల్లా కోటగిరి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌పై దాడికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
కవాడిగూడ, న్యూస్‌టుడే: నిజామాబాద్ జిల్లా కోటగిరి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌పై దాడికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైరదాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కమిటీ ప్రతినిధులు ఎం.సోమయ్య, అశోక్‌కుమార్, జంగయ్య, భిక్షపతి, లింగారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. దాడికి పాల్పడినవారిపై చర్యల విషయంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. గతేడాది గణేశ్ ఉత్సవాల సమయంలో కొందరు యువకులు తమ పాఠశాలకు వచ్చి చందా అడిగారని, నిరాకరించడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారన్నారు. తర్వాత క్షమాపణ కూడా చెప్పించారని వెల్లడించారు. సీఐఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.రమ, హేతువాద సంఘం ప్రతినిధి రమేశ్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి