logo

బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు

పేదలకు చెందాల్సిన బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 05:09 IST

మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌, చిత్రంలో డీసీఎస్‌వో చంద్రప్రకాష్‌, పౌర సరఫరాల సంస్థ డీఎం జగదీష్‌ కుమార్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పేదలకు చెందాల్సిన బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులు, రేషన్‌ డీలర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం పంపిణీలో నిజాయతీగా పనిచేసే డీలర్లకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. బోర్డు ఏర్పాటుతో పాటు నిల్వల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా డీలర్లు సరకులను దిగుమతి చేసుకోవాలన్నారు. దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్‌, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ జగదీష్‌కుమార్‌, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్‌, కార్యదర్శి పార్థసారథి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని