logo

రసవత్తరంగా ప్రోకబడ్డీ పోటీలు

పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీలు శనివారం రసవత్తరంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలోని 16 జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి.

Published : 05 Feb 2023 05:09 IST

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సభాపతి పోచారం

బాన్సువాడ, న్యూస్‌టుడే: పట్టణంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీలు శనివారం రసవత్తరంగా సాగాయి. ఉమ్మడి జిల్లాలోని 16 జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి 10 గంటల వరకు సాగుతున్నాయి. రాత్రిజరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా సభాపతి పోచారం హాజరై క్రీడాకారులను అభినందించారు. నిజామాబాద్‌ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, నిర్వాహకులు పోచారం శంభురెడ్డిలతో పాటు రైతుబంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, పురపాలక సంఘం ఛైర్మన్‌ జంగం గంగాధర్‌, నాయకులు ఎజాజ్‌, గోపాల్‌రెడ్డి, భూషణ్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి, బాబా, నారాయణరెడ్డి తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అక్కడే ఉండి పోటీలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తున్నారు.


జాతీయ సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి ఎంపిక

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఆదివారం నుంచి ఈ నెల 9 వరకు జరిగే 44వ సీనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ టోర్నీకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌ తెలిపారు. మహిళా జట్టులో ఎల్‌.రాణి, జె.వైశాలి, కె.సృజన (సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల), ఎ.ఇందు, ఎ.నందిని (పోచంపాడ్‌ గురుకుల), ఎస్‌.సౌమ్య, రాణి భూలబాయి (తాడ్వాయి గురుకుల), డి.మౌనిక (నిజామాబాద్‌ ట్రైబల్‌ డిగ్రీ) ఉన్నారు. బాలుర జట్టులో బి.సాయికుమార్‌ (రూప్లానాయక్‌ తండా), సెంథిల్‌ (సాఫ్ట్‌బాల్‌ అకాడమీ, ఆర్మూర్‌) ఉన్నారు. రాష్ట్ర జట్టులో జిల్లా క్రీడాకారులు ఉండటం సంతోషంగా ఉందని అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు.

ఎంపికైన క్రీడాకారులతో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని