logo

మహా సంబురం

తెలంగాణ వెలుపల తొలి భారాస సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇందూరు నేతలు కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసి తెలుగువారు ఉండే ప్రాంతాల్లో భారాస పథకాల గురించి ప్రచారం చేశారు.

Published : 06 Feb 2023 05:49 IST

నాందేడ్‌ సభ విజయవంతానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల కృషి
వారం రోజులుగా అక్కడే మకాం

అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌

న్యూస్‌టుడే, బోధన్‌, బోధన్‌ పట్టణం, నాందేడ్‌: తెలంగాణ వెలుపల తొలి భారాస సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఇందూరు నేతలు కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసి తెలుగువారు ఉండే ప్రాంతాల్లో భారాస పథకాల గురించి ప్రచారం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ పొరుగు గడ్డపై పార్టీ విధానాలపై ఆసక్తి కలిగించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు షకీల్‌, హన్మంత్‌ షిండే, జీవన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ ఏ.లలితతో సహా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సభ ఏర్పాట్లు మొదలు జనసమీకరణ వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ సంక్షేమ పథకాలపై మరాఠీ భాషలో రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. మహారాష్ట్ర గేయం ప్రాంగణంలో మార్మోగింది. తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు.

సభా వేదికపై జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ కవిత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని