logo

వామ్మో.. వసతిగృహం

చుట్టూ అటవీ ప్రాంతం. మధ్యలో నర్సింగ్‌ పాఠశాల. ఎప్పుడు ఏమవుతుందో తెలియక దినదిన గండంగా మారింది విద్యార్థినుల పరిస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం శోచనీయం.

Published : 07 Feb 2023 04:47 IST

న్యూస్‌టుడే, మాక్లూర్‌

స్నానాల గదిలోకి చొరబడిన ఉడుము

చుట్టూ అటవీ ప్రాంతం. మధ్యలో నర్సింగ్‌ పాఠశాల. ఎప్పుడు ఏమవుతుందో తెలియక దినదిన గండంగా మారింది విద్యార్థినుల పరిస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం శోచనీయం. మాక్లూర్‌ శివారులో ఏడాది క్రితం ప్రభుత్వం రూ.17.85 కోట్ల వ్యయంతో నర్సింగ్‌ పాఠశాలను నిర్మించింది. వసతిగృహం సైతం ఏర్పాటు చేసింది. గతేడాది జూన్‌ 13న తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 81 మంది విద్యార్థినులు వసతి గృహంలో ఉంటున్నారు. ఈ భవనానికి ప్రహరీ లేదు. వార్డెన్‌, వాచ్‌మెన్‌, అటెండర్లను ఇప్పటి వరకు నియమించలేదు. ఈ క్రమంలో రాత్రయితే చాలు విద్యార్థినులు భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతిరోజు పాములు, ఉడుములు, అడవిపందులు, కోతులు పాఠశాల ఆవరణ, వసతిగృహంలోకి వస్తున్నందున వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ చదువుకోవాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విషయమై ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ సబితను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా టెండర్‌ ప్రక్రియ ముగిసినందున వారం రోజుల్లోగా సిబ్బంది విధుల్లో చేరుతారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని