logo

ఎల్‌ఐసీని ప్రైవేటుపరం చేసే కుట్ర

ఎల్‌ఐసీని ప్రైవేటుపరం చేసేందు కేంద్రం కుట్ర చేసిందని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టించటం దీనికి నిదర్శనమన్నారు.

Published : 07 Feb 2023 04:47 IST

కార్యాలయం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్‌ నాయకులు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: ఎల్‌ఐసీని ప్రైవేటుపరం చేసేందు కేంద్రం కుట్ర చేసిందని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టించటం దీనికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం నిజామాబాద్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం అదానీ గ్రూపు షేర్లు నష్టాల్లో ఉండగా ఆ లోటును ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని నగర అధ్యక్షుడు కేశ వేణు, పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌ బిన్‌, ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్‌, నగేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ముప్ప గంగారెడ్డి, రామర్తి గోపి, వేణురాజ్‌, భాగ్య, ప్రభాకర్‌, జావిద్‌ అక్రం, రత్నాకర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని