logo

పొగాకు నియంత్రణపై అవగాహన అవసరం

పొగాకు నియంత్రణపై జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 04:47 IST

స్టడీమెటీరియల్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌ జితేశ్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పొగాకు నియంత్రణపై జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పొగాకు, మాదకద్రవ్యాల నియంత్రణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వైద్యులు రాసిన చీటీ ఉంటేనే ఔషధాలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని మెడికల్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణ ఐఏఎస్‌ శివేంద్రప్రతాప్‌, ఆబ్కారీశాఖ జిల్లా అధికారి రవీందర్‌రాజు, నోడల్‌ అధికారి షేక్‌సలాం, జిల్లా బాలల రక్షణ అధికారిణి స్రవంతి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కిష్టయ్య పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన: జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంను పాలనాధికారి జితేశ్‌ పరిశీలించారు. భద్రత  ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించారు.

స్టడీ మెటీరియల్‌ విడుదల: పదోతరగతి విద్యార్థులకు పరీక్షల స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్‌ జితేశ్‌ విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయాలని సూచించారు. డీఈఓ రాజు, ఏసీజీఈ నీలం లింగం, బలరాం, శ్రీకాంత్‌, జనార్దన్‌రెడ్డి, కృష్ణమూర్తి, రాజేశ్వర్‌రావు తదితరులున్నారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం కాలమానిని, దైనందినిని కలెక్టర్‌ ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని