logo

అల్పాహారం అందించి.. అభయమిచ్చి

ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు పదోతరగతి తొలిమెట్టు అని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 04:47 IST

మాచారెడ్డిలో విద్యార్థులతో ఎంపీపీ నర్సింగరావు, జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి

మాచారెడ్డి, న్యూస్‌టుడే: ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు పదోతరగతి తొలిమెట్టు అని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న వారికి అల్పాహారం అందించాలని ‘ఈనాడు’లో గత నెల 29న ప్రచురితమైన ‘నీరసించి.. చదువు మరిచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులకు రూ.లక్షకు పైగా విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు, జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డి, వైస్‌ఎంపీపీ నర్సిహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజు, సర్పంచి లలిత, తహసీల్దారు సునీత, ఎంఈఓ ఎల్లయ్య,  ఎంపీఓ నాగరాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎస్సీ-ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌, అరవింద్‌ కలిసి దాతను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని