logo

కిటికీ ధ్వంసం చేసి.. లాకర్‌ గదిలోకి వెళ్లి

నిజామాబాద్‌ శివారులోని ఖానాపూర్‌ ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంకు వెనకాల ఉన్న కిటికీ ఇనుపరాడ్లు ధ్వంసం చేసిన దుండగుడు లాకర్‌ గదిలోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

Updated : 08 Feb 2023 13:08 IST

ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం

బ్యాంకు వెనకాల తొలగించిన కిటికీ రాడ్లు 

నిజామాబాద్‌ నేరవార్తలు, నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ శివారులోని ఖానాపూర్‌ ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంకు వెనకాల ఉన్న కిటికీ ఇనుపరాడ్లు ధ్వంసం చేసిన దుండగుడు లాకర్‌ గదిలోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ నరేష్‌ కథనం ప్రకారం.. ఖానాపూర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు వెనకాల ఉన్న కిటికీ ఇనుప రాడ్లను దొంగ తొలగించాడు. అందులో నుంచి లోపలికి ప్రవేశించాడు. అంతటా వెతికి చివరకు లాకర్‌ గది వద్దకు వెళ్లాడు. స్ట్రాంగ్‌ రూంకు తాళం వేసి ఉండటంతో చెక్కతో ఉన్న తలుపును ధ్వంసం చేశాడు. లాకర్‌ను తెరిచేందుకు చూడగా వీలు కాలేదు. కొంతసేపటి తర్వాత అదే మార్గంలో వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం బ్యాంకు అధికారులు వచ్చి చూడగా ఈ ఘటన వెలుగుచూసింది. వెంటనే రూరల్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌, సీఐ నరేష్‌, ఎస్సై లింబాద్రి ఘటనాస్థలిని పరిశీలించారు. ఒక్కరే చోరీకి యత్నించాడని, నిందితుడు బయట రాష్ట్రానికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు. అందుబాటులో ఉన్న సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో బ్యాంకు లాకర్లలో రూ.10 లక్షల్లోపు నగదుతో పాటు పెద్దఎత్తున తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. లాకర్‌ వరకు వ్యక్తి వెళ్లినా సెన్సార్‌ శబ్దం రాకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పోలీసులు అధికారులను ఆరాతీయగా.. అలారం సెన్సార్‌ పనిచేయట్లేదని వారు చెప్పినట్లు తెలిసింది. మెండోరా దోపిడీ ఘటన జరిగిన అనంతరం పోలీసులు బ్యాంకర్లను హెచ్చరిస్తున్నా వారి తీరులో మార్పు రాకపోవటం విస్మయం కలిగిస్తోంది.

సీసీ కెమెరాలో చిక్కిన నిందితుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని