logo

విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆందోళన

మెండోరా మండలం సవెల్‌లో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సమస్యలకు నిరసనగా రైతులు 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట బుధవారం ఆందోళన చేశారు.

Updated : 08 Feb 2023 21:28 IST

బాల్కొండ: మెండోరా మండలం సవెల్‌లో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సమస్యలకు నిరసనగా రైతులు 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. వ్యవసాయానికి అందిస్తున్న త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సక్రమంగా రావడం లేదని, తరచూ కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24గంటలు విద్యుత్‌ అందిస్తుందన్న నమ్మకంతో తాము పంటలు వేశామని, కానీ సక్రమంగా విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్‌కో ఏఈ అంజద్‌ బాషాకు వినతి పత్రం అందజేశారు. గ్రామ కమిటీ సభ్యులతో పాటు రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని