logo

పెరిగిన ఆస్తి పన్ను డిమాండ్‌

నగర పాలక సంస్థలో ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను డిమాండ్‌ గుదిబండలాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు కేసులతో పాటు నివాసాలు, వ్యాపార వర్గాలు అన్ని కలిపి రూ.79 కోట్ల మేరకు డిమాండ్‌ నిర్ణయించారు.

Published : 19 Mar 2023 03:19 IST

వసూళ్లపై చేతులెత్తేసిన సిబ్బంది
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

ఆస్తి పన్ను నోటీసు జారీ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

నగర పాలక సంస్థలో ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను డిమాండ్‌ గుదిబండలాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు కేసులతో పాటు నివాసాలు, వ్యాపార వర్గాలు అన్ని కలిపి రూ.79 కోట్ల మేరకు డిమాండ్‌ నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం పూర్తవుతుండటం.. డిమాండ్‌ పెరగడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంత మేర లక్ష్యం సాధించడం కష్టమని ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు కేసులకు సంబంధించి మినహాయింపు ఇవ్వాలని లేఖ రాశారు.
ప్రభుత్వ కార్యాలయాలవే ఎక్కువ..  నగరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను రూ.23.79 కోట్ల మేరకు వసూలు కావల్సి ఉంది. ఇందులో కలెక్టరేట్‌ సముదాయం, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీసుశాఖ తదితరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.2.16 కోట్ల మేర కట్టారు.

కోర్టు కేసులతో తలనొప్పి..  ఆస్తి పన్ను వేసేందుకు కొలతలు సరిగా కొలవలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇందులో నగరంలోని ఓ నక్షత్ర హోటల్‌ ఉంది. కేసు తెగితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఏటా ఇలాంటివారితో తలనొప్పిగా మారింది.

సెలవులు లేవు.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వసూళ్ల లక్ష్యం కోసం బల్దియా సిబ్బంది కుస్తీ పడుతున్నారు. బిల్‌ కలెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్వోలతో నిత్యం కమిషనర్‌ చిత్రామిశ్రా సమీక్షిస్తున్నారు. రెవెన్యూవారికి సెలవులు కూడా ఇవ్వడం లేదు.


లేఖ రాశాం

- నరేందర్‌, రెవెన్యూ అధికారి, నగర పాలక సంస్థ, నిజామాబాద్‌

ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుకు సంబంధించి ఆస్తి పన్ను బకాయిలకు మినయింపు ఇవ్వాలని సీడీఎంఏకు లేఖ రాశాం. అమాంతంగా డిమాండ్‌ పెంచడంతో సిబ్బంది పని చేయడం కష్టంగా మారింది. ప్రైవేటు వారితో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేశాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు