logo

అన్నదాతల్లో చిగురించిన ఆశలు

ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో వారిలో ఆశలు చిగురించాయి.

Published : 24 Mar 2023 05:54 IST

ఈనాడు, నిజామాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనతో వారిలో ఆశలు చిగురించాయి. గురువారం ఆయన ఇతర జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. పరిహారం పదం వాడకుండానే.. నష్టపోయిన రైతుకు సహాయ పునరావాసం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో వరి, మొక్కజొన్న రైతులకు ఆర్థిక సహాయం అందే అవకాశాలున్నాయి. అర్హులను తేల్చేందుకు అవసరమైన విధివిధానాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. సాధారణంగా 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతింటేనే అర్హమైనదిగా పేర్కొంటారు. ఇప్పుడు ఆ నిబంధనలు కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సాయం అందేలా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. జిల్లాలో పంటల నష్టం అంచనాపై ఇప్పటికే ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. సుమారుగా 800 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని