logo

‘పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి’

రానున్న పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందునరేశ్‌ మాదిగ కోరారు.

Published : 24 Mar 2023 06:04 IST

మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందునరేశ్‌ మాదిగ

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: రానున్న పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందునరేశ్‌ మాదిగ కోరారు. మాదిగ సంగ్రామయాత్రలో భాగంగా 22వ రోజు గురువారం సదాశివనగర్‌కు చేరుకొని మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కాకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన భాజపా నమ్మక ద్రోహం చేస్తోందన్నారు. బిల్లు ప్రవేశపెట్టాలని ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌పీ జిల్లా కన్వీనర్‌ శ్రీకాంత్‌, పద్మారావు, భాగయ్య, పురుషోత్తం, సత్యక్క, మహిపాల్‌, సాయికుమార్‌, భూమన్న తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని