logo

మరుగుదొడ్ల నిర్వహణకు చర్యలు చేపట్టండి

పట్టణంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ‘ఈనాడులో’ గురువారం ‘రూ.కోట్లు వెచ్చించినా..నిరుపయోగం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్మూర్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నసీం సుల్తానా స్పందించారు.

Published : 24 Mar 2023 06:07 IST

పుర అధికారులను ఆదేశించిన ఆర్మూర్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి

పుర అధికారులకు సూచనలిస్తున్న ఆర్మూర్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నసీం సుల్తానా

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ‘ఈనాడులో’ గురువారం ‘రూ.కోట్లు వెచ్చించినా..నిరుపయోగం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్మూర్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నసీం సుల్తానా స్పందించారు. గురువారం పుర అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. మరుగుదొడ్లలో వాడిన నీరు బయటకి వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు లేవని గుర్తించారు. పైపులు, డ్రైన్‌ల ద్వారా నీరు బయటకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని పుర కమిషనర్‌ ప్రసాద్‌ చవాన్‌కు సూచించారు. అంచనాలు రూపొందించాలని కమిషనర్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. త్వరలోనే వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌, డీఈఈ భూమేశ్వర్‌, ఏఈ రఘు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని