logo

భారాస సమావేశంలో తేనెటీగల దాడి

జుక్కల్‌ మండలం సావర్‌గావ్‌లోని కౌలాస్‌నాలా జలాశయం సమీపంలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Published : 29 Mar 2023 06:16 IST

నెత్తిపై కండువాలు వేసుకొని పరుగులు తీస్తున్న కార్యకర్తలు, ప్రజలు

జుక్కల్‌, న్యూస్‌టుడే: జుక్కల్‌ మండలం సావర్‌గావ్‌లోని కౌలాస్‌నాలా జలాశయం సమీపంలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే సభలో ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు ప్రజలు, కార్యకర్తలపై దాడి చేశాయి. ఉలిక్కిపడిన వారు నెత్తిపై కండువాలు వేసుకుని బయటకు, పొలాల్లోకి పరుగులు తీశారు. దీంతో గంట పాటు గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేతో పాటు పలువురిని తేనెటీగలు కుట్టినట్లు స్థానికులు తెలిపారు. అంతా సద్దుమణిగాక తిరిగి సభా ప్రాంగణానికి చేరుకొని భోజనాలు చేశారు. తర్వాత జలాశయం కార్యాలయంలో ఎమ్మెల్యే ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

జుక్కల్‌కు రూ.165 కోట్లు

అయిదేళ్లలో ఒక్క జుక్కల్‌ మండలానికే రైతుబంధు కింద 13,107 మంది కర్షకుల ఖాతాల్లో రూ.165 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే తెలిపారు. కౌలాస్‌నాలా జలాశయం సమీపంలో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో కొత్తగా నాలుగు గురుకుల విద్యాలయాలు స్థాపించామన్నారు. సర్పంచి కిషన్‌ పవార్‌, వైస్‌ ఎంపీపీ ఉమకాంత్‌ దేశాయ్‌, భారాస మండలాధ్యక్షుడు మాధవ్‌రావు దేశాయి, నాయకులు నీలుపటేల్‌, సాయాగౌడ్‌, నాగల్‌గిద్దె శివానంద్‌, అనితాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని