logo

నాపైనా కేసులు పెడతారు.. భయపడను : మంత్రి

ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు ప్రధాని నరేంద్ర మోదీ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మోర్తాడ్‌ మండల కేంద్రం ఆర్‌అండ్‌బీ కల్యాణ వేదికలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

Published : 29 Mar 2023 06:23 IST

ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మోర్తాడ్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు ప్రధాని నరేంద్ర మోదీ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మోర్తాడ్‌ మండల కేంద్రం ఆర్‌అండ్‌బీ కల్యాణ వేదికలో మంగళవారం భారాస ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రధాని మోదీ కార్పొరేట్‌ స్నేహితులకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. జీవిత బీమా సంస్థలో ఉన్న పేదల డబ్బులను అదానీకి దోచిపెట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తనపై కూడా కేసులు పెడతారనీ.. కానీ భయపడే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని మంత్రి అన్నారు. ఎంపీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయని, ఇద్దరి కొడుకుల రాజకీయాలు తండ్రిని ఇబ్బంది పెడుతున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలోనే 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేపర్‌ లీకేజీ దురదృష్టకరమేనని.. యువత అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సమ్మేళనానికి పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, డాక్టర్‌ మధుశేఖర్‌, రైతు నాయకుడు కోటపాటి నర్సింహం నాయుడు, ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, సర్పంచి ధరణి, ఉపసర్పంచి గంగారెడ్డి, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు