logo

ముందుకు కదలని పనులు

నవీపేట మండలం స్టేషన్‌ ఏరియా పంచాయతీ కార్యాలయం ఇది. పాత వీడీవో క్వార్టర్స్‌ గదిలో కొనసాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు

Published : 29 Mar 2023 06:27 IST

జిల్లాకు కొత్తగా 136 పంచాయతీ భవనాలు

 40 చోట్ల మాత్రమే ప్రారంభం
న్యూస్‌టుడే, నవీపేట

స్టేషన్‌ ఏరియా పంచాయతీ భవనం

నవీపేట మండలం స్టేషన్‌ ఏరియా పంచాయతీ కార్యాలయం ఇది. పాత వీడీవో క్వార్టర్స్‌ గదిలో కొనసాగిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరు వరకు పనులు ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పలు చోట్ల తాత్కాలికంగా అద్దె, ప్రభుత్వ పాత, మహిళా మండలి భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 136 భవనాలను మంజూరు చేసింది. ఉపాధిహామీ కింద ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.27.20 కోట్ల నిధులు కేటాయించింది. పనులను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు 40 చోట్ల మాత్రమే ప్రారంభమైనట్లు డీఆర్డీవో చందర్‌ చెప్పారు.


స్థలం లేక జాప్యం

మహిళా మండలి భవనంలో తాత్కాలికంగా పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. కొత్త భవన నిర్మాణానికి ఇటీవల రూ.20 లక్షలు మంజూరయ్యాయి. గ్రామంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోంది.

స్థలం కోసం అన్వేషిస్తున్నాం.
 రాము, సర్పంచి, మట్టయ్యఫారం తండా గుత్తేదారులు


ముందుకు రావడం లేదు

భవన నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించాం. పనులు చేసేందుకు కొంత మంది గుత్తేదారులు ముందుకురావడం లేదని సమాచారం ఉంది. సత్వరమే ప్రారంభించేందుకు ఆయా శాఖల అధికారుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
 చందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, నిజామాబాద్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని