logo

స.హ చట్టంతోనే అవినీతి అంతం

సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయడానికి సమాచార హక్కు చట్టమే వజ్రాయుధమని పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ సలీం అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన మాట్లాడారు.

Updated : 26 May 2023 06:14 IST

మాట్లాడుతున్న స.హ చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ సలీం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయడానికి సమాచార హక్కు చట్టమే వజ్రాయుధమని పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్‌ సలీం అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన మాట్లాడారు. స.హ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా దరఖాస్తు చేయాలో యువత తెలుసుకో వాలని సూచించారు. వివిధ సెక్షన్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రతినిధులు ప్రదీప్‌, షబానా, భాస్కర్‌, గంగయ్య, రవి, గంగాధర్‌, జగదీశ్వర్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని