logo

జిల్లా ఆసుపత్రికి నాలుగో స్థానం

ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప పురస్కారాలను తాజాగా కేంద్రం ప్రకటించింది. కామారెడ్డికి వైద్యకళాశాల మంజూరైన నేపథ్యంలో వచ్చే ఏడాది జిల్లా ఆసుపత్రికి కాయకల్ప పురస్కారం ఉండదు.

Published : 02 Jun 2023 05:56 IST

కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప పురస్కారాలను తాజాగా కేంద్రం ప్రకటించింది. కామారెడ్డికి వైద్యకళాశాల మంజూరైన నేపథ్యంలో వచ్చే ఏడాది జిల్లా ఆసుపత్రికి కాయకల్ప పురస్కారం ఉండదు. జిల్లా ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానం దక్కింది. 81.03 శాతం మార్కులు వచ్చాయి. రూ.3 లక్షల నిధులు రానున్నాయి. ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల విభాగాల్లో.. బాన్సువాడకు 86.14 శాతం మార్కులు రాగా రూ.10 లక్షల నిధులు కేటాయించారు. దోమకొండ ఆసుపత్రికి 71 శాతం మార్కులు రాగా రూ. లక్ష నిధులు రానున్నాయి. జిల్లాలోని హన్మాజీపేట, రామారెడ్డి, బీబీపేట, నాగిరెడ్డిపేట, డోంగ్లీ, అన్నారం, ఉత్నూర్‌, లింగంపేట, బీర్కూరు పెద్దకొడప్‌గల్‌ పీహెచ్‌సీలకు రూ.6.5 లక్షలు కేటాయించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు