logo

మిగిలిన పనులు త్వరగా పూర్తిచేస్తాం

కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌ వాగులో ఏర్పాటు చేసిన డెలివరీ పాయింట్‌లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 05:56 IST

డెలివరీ పాయింట్‌ను పరిశీలిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

జక్రాన్‌పల్లి, న్యూస్‌టుడే: కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌ వాగులో ఏర్పాటు చేసిన డెలివరీ పాయింట్‌లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తిచేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం 21వ ప్యాకేజీ పైపులైను పనులు పరిశీలించి మాట్లాడారు. పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన పైపులైను పనులు పూర్తయినందున త్వరలో వాగులోకి సాగునీరు చేరుతుందన్నారు. దీంతో ఏడాది పొడవునా వాగులో జలకళ సంతరించుకొని భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని