logo

కలెక్టరేట్‌లో నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు

రాష్ట్ర అవతరణ వేడుకలను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 02 Jun 2023 06:13 IST

హాజరుకానున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

విద్యుత్తు కాంతులతో వెలుగులీనుతున్న జిల్లా సచివాలయం

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ వేడుకలను కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌ ఏర్పాట్లను పరిశీలించారు.
* ఉదయం 9 గంటలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు.
* 9.05: మంత్రి ప్రసంగం
* 9.35: సాంస్కృతిక కార్యక్రమాలు
* 9.50: ప్రశంసా పత్రాలు అందజేత
* 10.05: వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల పరిశీలన

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని