నగరంలో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.
వాహనాలపై మానాల మోహన్‌రెడ్డి, నేతలు, కార్యకర్తలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ భవన్ నుంచి ప్రారంభమైన వాహన ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా, పులాంగ్, ఆర్‌ఆర్, వర్ని చౌరస్తా, గాంధీ చౌక్, రైల్వేస్టేషన్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే భారాస ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో అలజడి చేస్తోందన్నారు. అర్బన్ ఇన్‌ఛార్జి తాహెర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, కార్పొరేటర్ రోహిత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా అధ్యక్షుడు విక్కీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.