ప్రేమ పెళ్లి.. నెలరోజులకే దంపతుల బలవన్మరణం
ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట ఆర్థిక సమస్యలతో బలవన్మరణం చెందిన విషాద ఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది.
పిట్లం: ప్రేమ పెళ్లితో ఒక్కటైన జంట ఆర్థిక సమస్యలతో బలవన్మరణం చెందిన విషాద ఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బొల్లక్‌పల్లి యువకుడు ఉప్పరి సంతోష్(21), బాన్సువాడ మండలం దాల్‌మల్ గుట్టకు చెందిన కవిత(19) ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం విషయాన్ని పెద్దలకు తెలిపారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో వారు అంగీకరించలేదు. దీంతో నెల రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఉపాధి లేక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.