logo

శ్రీక్షేత్రం ఎంతో మారింది

పూరీ శ్రీక్షేత్రం రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఎంతో మారిందని, దర్శనాలకు సులువుగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లికి చెందిన సత్యనారాయణ,

Published : 30 Jun 2022 04:20 IST

ఆంధ్రా భక్తుల ఆనందం

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: పూరీ శ్రీక్షేత్రం రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఎంతో మారిందని, దర్శనాలకు సులువుగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లికి చెందిన సత్యనారాయణ, సింహాచలం, వెంకటరమణ చెప్పారు. బుధవారం పూరీ వచ్చిన ఈ ముగ్గురు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. జగన్నాథుడు తమ ఆరాధ్య దైవమని, 30 ఏళ్లుగా ఏటా రథయాత్రకు వస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు స్వామి యాత్రకు రాలేకపోయామన్నారు. 2019లో శ్రీక్షేత్ర ఆవరణ ఇరుకుగా ఉండేదని, ఇప్పుడు విశాలంగా ఉందన్నారు. అప్పట్లో సౌకర్యాలు సరిగా లేవని, ఇప్పుడు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. బొడొదండోలో శుచి, శుభ్రత బాగున్నాయని, పవిత్రత కనిపిస్తోందన్నారు. ఆహారానికి ఇబ్బంది లేదని, స్వామి ఒబడా (మహాప్రసాదం)ను ఆరగించామన్నారు. జగన్నాథుని తనివితీరా దర్శనం చేసుకున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని