logo
Published : 06 Aug 2022 01:56 IST

తొమ్మిదేళ్లలో 20 మంది హత్య

జిల్లాలో చేతబడి అనుమానం హత్యలకు పడని అడ్డుకట్ట

టిట్టిగూడ గ్రామంలో విచారిస్తున్న ఎస్డీపీవో దేబజ్యోతి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: చట్టాలు హెచ్చరిస్తున్నా, న్యాయస్థానాలు శిక్షిస్తున్నా జిల్లాలో చేతబడి పేరుతో జరుగుతున్న హత్యలకు అడ్డుకట్ట పడడం లేదు. తొమ్మిదేళ్లలో ఇరవై మంది దారుణ హత్యకు గురి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా కాశీపూర్‌ సమితి దుడుకాబాహల్‌ పంచాయతీ టిట్టిగూడ గ్రామంలో దొయిమాఝి అనే వ్యక్తి చేతబడి నెపంతో బుధవారం అర్ధరాత్రి హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాల కారణంగా అమాయకులు అనుమాన భూతానికి బలవుతున్నారు. రాయగడ సమితి శేసికల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి దుర్గం గ్రామానికి చెందిన 14 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ 2019లో జిల్లా అదనపు సెషన్స్‌ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చేతబడి అనుమానంతో గ్రామానికి చెందిన దెఖినో తాడంగి అనే వ్యక్తిపై 2017, నవంబర్‌ 18న దాడి చేసి హత్య చేసిన నేరానికి ముద్దాయిలకు న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. దీని తరువాత ఈ తరహా హత్యలు కొంతమేర తగ్గినా పూర్తిగా అడ్డుకట్ట పడలేదని  తాజా ఘటన రుజువు చేస్తోంది.

జాగిలానికి గుడ్డ వాసన చూపిస్తున్న అధికారి

ఆరు సమితుల్లో తీవ్రం

11 సమితులున్న జిల్లాలో రాయగడ, కాశీపూర్‌, మునిగుడ, బిసంకటక్‌, కె.సింగుపూర్‌, గుణుపురం సమితుల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మలేరియా, డెంగీ, అతిసారం వంటి కేసులు ఎక్కువగా ప్రబలే ఆయా ప్రాంతాల్లో మూఢవిశ్వాసాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి.

పోలీసు రికార్డుల ప్రకారం.... 2011 నుంచి 2019 వరకు జిల్లాలో చోటుచేసుకున్న చేతబడి అనుమానపు హత్యల వివరాలను పరిశీలిస్తే

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts