logo
Published : 06 Aug 2022 01:56 IST

కాంగ్రెస్‌ జైలుభరో ఆందోళన

ఆర్డీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిత్యావసరాలు, వంటగ్యాసు, చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా గంజాం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన, జైలుభరో ఆందోళన చేపట్టింది. ఉదయం స్థానిక బాపూజీ ఆశ్రమం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా స్థానిక దక్షిణ మండల ఆర్డీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రదర్శన నిర్వహించి కేంద్రం తీరును దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ సంస్థలను అది దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ఇంతవరకూ గంజాం జిల్లాలో కొత్తగా పరిశ్రమలేవీ ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. ఫలితంగా జిల్లా నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోపలికి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని వాహనంలో అక్కడి నుంచి తరలించి తర్వాత విడిచిపెట్టారు. ఈ ఆందోళనలో పీసీసీ పర్యవేక్షకునిగా కొంధమాల్‌ మాజీ ఎంపీ నకుల్‌ నాయక్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పీతబాస పండా, రశ్మిరంజన్‌ పట్నాయక్‌, ప్రఫుల్ల పండా, దేవీ బిశోయి, మహేశ్వర పాత్ర్‌, దొండపాణి పాత్ర్‌, సంగ్రాం మహంతి, సుజిత్‌ స్వయిన్‌, బృందావన ఖొటెయి, బనజా పండా, సుభాషిణి పట్నాయక్‌, గీతా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుర ఎస్డీపీఓ విష్ణుప్రసాద్‌ పతి, పలు ఠాణాల ఐఐసీల పర్యవేక్షణలో బలగాలను మొహరించారు.
 

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని