logo

ఆదర్శ గురుకులం నిర్మాణానికి మార్గం సుగమం

పూరీ శ్రీక్షేత్రానికి చేరువలో ఆదర్శ గురుకుల కేంద్రం నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి. శనివారం శ్రీక్షేత్ర పాలక వర్గ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చ జరిగింది.

Published : 08 Aug 2022 06:53 IST


గురుకుల కేంద్రం నిర్మాణం కానున్న శ్రీక్షేత్ర ఆవరణ

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రానికి చేరువలో ఆదర్శ గురుకుల కేంద్రం నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి. శనివారం శ్రీక్షేత్ర పాలక వర్గ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చ జరిగింది. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణ పూర్తి కాగా, బిర్లా ఫౌండేషన్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. గురుకులం నిర్మాణానికి రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వం ఇదివరకే రూ.10 కోట్లు కేటాయించింది. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది.

అన్ని వర్గాల వారికీ ప్రవేశం
పూరీ వేదభూమి. రుషులు, సిద్ధయోగులు, తత్వ సంపన్నులకు మార్గనిర్దేశకత్వం చేసిన పుణ్యభూమి. ఇలాంటి నేలపై గురుకుల కేంద్రం ఏర్పాటు చేసి వేదాలు, ఉపనిషత్తులపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. సేవాయత్‌ల పిల్లలతో పాటు, ఇతర వర్గాల వారికీ ప్రవేశం కల్పించనున్నారు. వేదోపనిషత్తుల్లో నిష్ఠాగరిష్ఠులైన వారు ఇక్కడ ఆచార్యులుగా సేవలందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని