logo

కటక్‌లో కాషాయ సందడి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కటక్‌ రానున్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం అమిత్‌ షా హోర్డింగులు, భాజపా జెండాలతో కాషాయమయమైంది.

Published : 08 Aug 2022 06:53 IST

అమిత్‌ షా రానున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు

బారాబటి ప్రవేశ ద్వారం వద్ద అమిత్‌ షా ఫ్లెక్సీలు

కటక్‌, న్యూస్‌టుడే: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కటక్‌ రానున్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం అమిత్‌ షా హోర్డింగులు, భాజపా జెండాలతో కాషాయమయమైంది. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో భువనేశ్వర్‌ చేరుకోనున్న అమిత్‌ షా రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు ఒడియా బజార్‌ ప్రాంతంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో మహానది తీరంలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం చేరుకుని, ప్రజాతంత్ర దినపత్రిక 75వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కలెక్టర్‌ భవానీ శంకర్‌ ఛయనీ, పోలీసు అధికారులు కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకొని ఏర్పాట్లు పరిశీలించారు. డీసీపీ పినాకి మిశ్ర పోలీస్‌ అధికారులు, బలగాలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 30 ప్లటూన్ల బలగాలను బందోబస్తు కోసం నియమించినట్లు చెప్పారు.


ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీసీపీ పినాకి మిశ్ర, ఇతర పోలీసులు అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని