logo

నవవధువు ఆత్మహత్య

వివాహమైన రెండు నెలలకే నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కటక్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

Published : 08 Aug 2022 06:53 IST


ప్రజ్ఞ పరిమిత (పాత చిత్రం)

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: వివాహమైన రెండు నెలలకే నవవధువుకు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కటక్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కటక్‌కు చెందిన ప్రజ్ఞ పరిమిత స్వయిన్‌(23)కు భువనేశ్వర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌ పాత్ర్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. పది రోజుల తరువాత ఆమెకు నోటిలో పుండు అయింది. దానిని క్యాన్సర్‌ అనుకున్న అత్త, భర్త ప్రజ్ఞను వేధించడం ప్రారంభించారు. మోసం చేసి పెళ్లి చేశారంటూ ఇద్దరూ కలిసి ఆమెను కన్నవారి ఇంటికి పంపించేశారు. అప్పటి నుంచి మనస్తాపం చెందిన ప్రజ్ఞ ఇంట్లో ముభావంగా ఉండేది. ఆమె సోదరుడు ప్రియ వ్రత స్వయిన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అది క్యాన్సర్‌ కాదని పరీక్షల్లో తేలింది. ఆ విషయాన్ని సోదరి అత్తగారికి ఫోన్‌ చేసి చెప్పిన ప్రియ వత్ర స్వయిన్‌ తమ ఇంటికి తీసుకెళ్లాలని కోరాడు. అందుకు నిరాకరించిన ప్రజ్ఞ అత్త, భర్త ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రానిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో పంకాకు ఉరేసుకుని ప్రజ్ఞ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై స్వయిన్‌ భువనేశ్వర్‌ని మంచేశ్వర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తన సోదరిని ఆమె అత్తింటి వారే చంపేశారని పేర్కొన్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని