logo

విపత్తులు వెంటాడుతున్నాయ్‌.. ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయ్‌!

ఒడిశాకు తరచుగా విపత్తులు చుట్టుముడుతున్నాయని, రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయని నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. ఆదివారం దిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైంది.

Published : 08 Aug 2022 06:53 IST

నీతిఆయోగ్‌ సమావేశంలో సీఎం నవీన్‌


సమావేశంలో ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒడిశాకు తరచుగా విపత్తులు చుట్టుముడుతున్నాయని, రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలవుతున్నాయని నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. ఆదివారం దిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సాయం చేయాలని కోరారు.

ప్రధానికి అభినందన
కరోనా మహమ్మారి నియంత్రించడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు, ఉచిత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అభినందనీయమని నవీన్‌ ప్రశంసించారు. దిల్లీలో సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా నీతి ఆయోగ్‌ సమావేశంలో కీలకాంశాలు ప్రస్తావించామని చెప్పారు. ప్రత్యేక హోదా పట్ల ఆశాభావంతో ఉన్నామన్నారు.   

ముఖ్యమంత్రి డిమాండ్లు ఇవే..
ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నా రాష్ట్రం పేదరికంతో సతమతమవుతోంది. ప్రాంతీయ అసమానతలు కనిపిస్తున్నాయి. సమగ్రాభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా కేటాయించాలి. కొన్నేళ్లుగా కోరుతున్నాం.
* విపత్తుల మూలంగా ఆర్థికంగా ఇబ్బందులు చవిచూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం విపత్తుల సాయం 90:10 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలి.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ, గ్రామాలకు బ్యాంకింగ్‌ సేవలు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి.
* వెనుక బడిన కేబీకే జిల్లా అభివృద్ధికి ప్రత్యేక మొత్తాలు కేటాయించాలి.
* ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. లోపాలు సరిదిద్ది అమలయ్యేలా చూడాలి.
* రాష్ట్రంలో 16 లక్షల పేదకుటుంబాలకు పక్కా ఇళ్లు కేటాయించాలని ఎంతో కాలంగా కోరుతున్నాం. నిరాశ్రయులు ఇబ్బందులు చవి చూస్తున్నారు. 2019 మే 3న ఫొని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉత్తరకోస్తా ప్రాంతాల్లో 6 లక్షల పూరిగుడిసెలు కూలిపోయాయి. వారందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని