logo
Published : 10 Aug 2022 03:43 IST

ఘనంగా సరళాదేవి అవార్డు ప్రదానం


రంజిత నాయక్‌ను సరళాదేవి స్మారక అవార్డుతో సత్కరిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ప్రతిభా రాయ్‌ తదితరులు

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌లో గల శతాబ్ది భవన్‌లో మంగళవారం సరళాదేవి స్మృతి సంసద్‌ ఆధ్వర్యంలో సరళాదేవి స్మారక అవార్డు ప్రదానోత్సవం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రముఖ సాహితీవేత్త రంజిత నాయక్‌కు ప్రశంసాపత్రం, నగదు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరళాదేవి అగ్నికన్యగా గుర్తింపు పొందారని, స్వాతంత్య్రం కోసం ఆమె తన కుటుంబాన్ని వదిలి పోరాడారన్నారు. సాహితీవేత్తగా కూడా ప్రాచుర్యం పొందారన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, రచయిత ప్రతిభా రాయ్‌, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Read latest Odisha News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని